Pushpa 2 is also one of the most awaited movies in the Tollywood industry. There are huge expectations on this movie directed by Sukumar.
ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ పేరు మారుమోగింది. మాస్.. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. దీంతో ఈ మూవీకి సెకండ్ పార్ట్ గా వస్తున్న పుష్ప 2పై అంతకు మించిన అంచనాలు పెట్టేసుకున్నారు. ఇక గతంలో రిలీజ్ అయిన పుష్ప 2 ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈసారి పుష్పరాజ్ గా బన్నీ ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడనేది బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట వైరలవుతుంది.
సెకండ్ పార్టులో స్టార్ హీరోహీరోయిన్స్ స్పెషల్ అప్పీయరెన్స్ కానున్నట్లు టాక్ వినిపించింది. తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, సాయి పల్లవి కీలకపాత్రలు పోషించనున్నారని ప్రచారం నడిచింది. అయితే వీటిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అలాగే ఫస్ట్ పార్ట్ మాదిరిగానే సెకండ్ పార్ట్ లో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని.. ఇందులో మళ్లీ సమంత నటించనుందని టాక్ నడిచింది. ఆ తర్వాత సమంత స్థానంలోకి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వచ్చిందని.. ఈసారి అతిలోక సుందరి తనయ బన్నీ సరసన స్పెషల్ సాంగ్ చేయనుందని రూమర్స్ హల్చల్ చేశాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మేకర్స్ స్పందించలేదు. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.