‘ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 246 పరుగులకు కుప్పకూలింది.
అనంతరం తొలిరోజు ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 76 పరుగులతో, శుభ్‌మన్ గిల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ తన టెస్టు కెరీర్లో రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ కంటే 127 పరుగులు వెనుకంజలో నిలిచింది. 🏏
‘కెప్టెన్ రోహిత్ శర్మ (24 పరుగులు) జాక్ లీచ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు హైదరాబాద్‌లో ఇంగ్లండ్ తరపున కెప్టెన్ బెన్ స్టోక్స్ అత్యధికంగా 70 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టో 37 పరుగులు, బెన్ డకెట్ 35 పరుగులు చేశారు.’ 🏏