top of page
MediaFx

ఇరాన్ అధీనంలో ఇజ్రాయెల్‌ కార్గో నౌక.. నౌకలో 17 మంది భారతీయులు..

ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిష్‌ను ఇరాన్‌ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

గల్ఫ్‌లోని జియోనిస్ట్ పాలనకు సంబంధించిన కంటైనర్ షిప్‌ను రివల్యూషనరీ గార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్‌ మీడియా ప్రకటించింది. ఎంసీఎస్‌ ఏరీస్ పేరున్న కంటైనర్ షిప్‌ను ఇరాన్‌ నేవీ స్పెషల్ ఫోర్సెస్ అయిన సెపా గార్డ్స్ హెలికాప్టర్‌ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారి విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. యూఏఈ తీరంలోని హార్ముజ్ జలసంధి సమీపం నుంచి ఈ కార్గో షిప్‌ను ఇరాన్‌ జలాల వైపు మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. ఇరాన్‌ కమాండోలు హెలికాప్టర్‌ నుంచి రోప్‌ ద్వారా కంటైనర్ షిప్‌పైకి దిగిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇరాన్‌ తీరుపై ఇజ్రాయెల్‌ సైన్యం మండిపడింది. తమ దేశం భూభాగంపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. కాగా, ఇరాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జరిగిన ఈ సంఘటనపై ఇజ్రాయెల్‌ స్పందించింది. ఈ ప్రాంతంలో పరిస్థితులను మరింత తీవ్రం చేస్తున్న ఇరాన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్‌ ఆర్మీ హెచ్చరించింది.

bottom of page