top of page
MediaFx

18 నెలల బాలుడిపై వీధి కుక్క దాడి : వీడియో..


కరీంనగర్ : రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభు త్వం పట్టించుకోకపోవడంతో రోజురోజుకు వాటి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని(Karimnagar) శాతవాహన యూనివర్సిటీ సమీపంలో 18 నెలల బాలుడిపై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..శాతవాహన యూనివర్సిటీ సమీపంలో రోడ్డు మీద హరినందన్ అనే చిన్నారి మరో బాలుడితో కలిసి ఆడుకుంటున్నారు. అయితే అదే సమయంలో హరినందన్ పై వీధి కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ హాస్పిటల్‌లో చేర్పించారు. బాలుడిపై దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, వీధికుక్కల నుంచి రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కుక్కల బెడద ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవు తున్నారు. వీధి కుక్కల బెడ‌ద నుంచి తమను ర‌క్షించాల‌ని స్థానికులు కోరుతున్నారు.



bottom of page