top of page
Shiva YT

సముద్రంలోకి వెళ్లి 18 మంది మృతి..

యుద్ధంలో నష్టపోయిన గాజా ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విమానాలు జారవిడిచిన ఆహార పెట్టెల కోసం సముద్రంలోకి దిగిన 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 మంది ఆహార పెట్టెలు కిందపడి చనిపోగా... మరో ఆరుగురు నీటి ప్రవాహానికి ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని లాహియా బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.



bottom of page