20 కోట్ల వ్యూస్ ని దక్కించుకున్న వీడియో..
- MediaFx
- Sep 12, 2024
- 1 min read
3 ఏళ్ల బాలిక పాడుతున్న వీడియో ఒకటి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఆ బాలిక ‘టైటానిక్’ చిత్రంలోని ప్రసిద్ధ పాట మై హార్ట్ విల్ గో ఆన్‌ను పియానో ఆర్టిస్ట్‌తో కలిసి హమ్ చేస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్లో నెటిజన్లను చాలా ఆకట్టుకుంది. గత కొన్ని రోజులుగా ఏ రీల్స్‌కు కూడా దక్కని వ్యూస్ ఈ వీడియోకు దక్కాయి. ఈ అమ్మాయి రీల్‌ని ఇప్పటివరకు 20 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఈ వైరల్ వీడియో నిజంగా చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే ఇందులో 3 ఏళ్ల ఏంజెలికా నీరో.. అమాయకత్వానికి.. చిన్నారి ప్రతిభకి మిలియన్ల మంది ప్రజలు ఫిదా అయ్యారు. కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ‘టైటానిక్’ సినిమాలోని ‘మై హార్ట్ విల్ గో ఆన్’ అనే ఐకానిక్ సాంగ్‌ని ఆ అమ్మాయి పాడిన తీరు జనాలకు చాలా ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా మారింది. పియానో కళాకారుడు ఎమిల్ రీనెర్ట్‌తో ఈ అందమైన క్షణం వీధిలో ఉన్న వ్యక్తుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ రీల్‌కు సంబంధించి వ్యక్తుల నుంచి అపూర్వమైన స్పందనలు కనిపించాయి. ఈ వీడియో చాలా శక్తివంతమైనది. ప్రజలు దీన్ని మళ్లీ మళ్లీ లూప్‌లో చూస్తున్నారు.