ఏప్రిల్ నెలలో, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో తెల్లవారుజామున ఫైరింగ్ జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్ మొత్తం ఉలిక్కి పడింది. ఆ తర్వాత ఈ ఫైరింగ్ చేసింది బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. ఈ ఘటనలో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు పథకం పన్నినట్లు తెలిసింది. సల్మాన్‌ను చంపేందుకు 8 నెలలుగా పథకం పన్నారు. సల్మాన్ ప్రతి కదలికపై బిష్ణోయ్ గ్యాంగ్ ఓ కన్నేసి ఉంచింది. సల్మాన్ బాంద్రా ఇల్లు, పన్వెల్ ఫామ్‌హౌస్ అలాగే ఫిల్మ్ సిటీతో పాటు అతని కార్యకలాపాల వివరాలను సేకరించారు. పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చిన బిష్ణోయ్ ముఠా సభ్యుడు సల్మాన్ ను హత్య చేసేందుకు ఏకే-47, ఎం16, ఏకే-92లను ఉపయోగించాలనుకున్నారు. సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు షూటర్లు రూ.25 లక్షలక్షలు సుపారీ తీసుకున్నారని తెలుస్తోంది. ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య కాలంలో సల్మాన్ ఖాన్‌ను హతమార్చేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నినట్లు పన్వెల్ సిటీ పోలీసులు ఛార్జ్ షీట్‌లో తెలిపారు.
పోలీసులు బిష్ణోయ్ గ్యాంగ్‌లోని పలువురిని అరెస్టు చేశారు. ఈ నిందితుల్లో ఉత్తరప్రదేశ్‌లో అరెస్టయిన ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గుజరాత్‌లో అరెస్టయిన గౌరవ్ భాటియా అలియాస్ నహై అలియాస్ సందీప్ బిష్ణోయ్, సంభాజీనగర్‌లో అరెస్టయిన వాస్పీ మహమూద్ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, జిషన్ జక్రుల్ హసన్ అలియాస్ జావేద్ ఖాన్, దీపల్ హవా సింగ్ గొగాలియా ఉత్తరప్రదేశ్‌లో అరెస్టయ్యారు. వీరితో పాటు జాన్ వాల్మీకి కూడా ఉన్నాడు. గత నెలలో పన్వేల్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం, నిందితులు సల్మాన్‌ను హతమార్చడానికి అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు మెసేజిలు పంపించుకునేందుకు వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్‌లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధాల తరహాలోనే వాడతారని చెప్పుకున్నారు. ఛార్జ్ షీట్ ప్రకారం, లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అమోల్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ కుట్రలో పాల్గొన్న 60 నుండి 70 మందితో ఈ మొత్తం కుట్రను పన్నారు. ఈ వాట్సాప్ వీడియో కాల్‌లో ఉన్న మరో వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన డోగర్‌గా గుర్తించారు. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాపై కాల్పులు జరిపిన టర్కీలో తయారైన జిగానా పిస్టల్‌తో సల్మాన్ ను హత్య చేయాలని ఈ ముఠా ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పులకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్, అతని తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు.