top of page
MediaFx

తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు…


ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం, ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో మరో మూడ్రోజులు వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని సూచిస్తున్నారు వాతావరణ అధికారులు.

తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ చెప్పింది. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో వర్షాలుంటాయని చెప్పారు వాతావరణ అధికారులు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంది. సిటీలో మళ్లీ ముసురు కొనసాగుతోంది. పలుచోట్ల మోస్తరు వర్షం పడుతోంది.


bottom of page