top of page

తెలంగాణలో రెండున్నరేళ్లలో 30 లక్షల డూప్లికేట్ ఓటర్లు.. 🗳️🚫

Suresh D

గత రెండున్నరేళ్లలో సుమారు 30 లక్షల డూప్లికేట్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. గత ఏడాది 8.58 లక్షల డూప్లికేట్ ఎంట్రీలను ఓటరు జాబితా నుంచి తొలగించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర పట్టణ ప్రాంతాల్లో ఈ డూప్లికేషన్లు ఎక్కువగా వెలుగు చూశాయని ఆయన తెలిపారు. నివాసాలను మార్చిన తర్వాత ఓటర్లు సమాచారాన్ని అప్డేట్ చేయడంలో ఆలస్యం చేయడం వల్లనే ఈ డూప్లికేట్ ఎంట్రీలు ఎక్కువగా వచ్చాయని ఆయన చెప్పారు.డూప్లికేట్ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వికాస్ రాజ్ తెలిపారు.📋🚫



 
bottom of page