వరదలో చిక్కుకున్న 30 మంది..
- MediaFx
- Jul 19, 2024
- 1 min read
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నారు. భారీ వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలోనే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. వరద ప్రవాన్ని గమనించిన అధికారులు.. ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటికి దిగువకు వదిలారు. ఎక్కసారిగా గేట్లు ఎత్తటంతో.. దిగువకు వరద ప్రవాహం పెరిగింది. కాగా.. ఈ వరదలో 30 మంది వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు చిక్కుకున్నారు. మంత్రుల ఆదేశాలతో హెలికాప్టర్ సాయంతో వాళ్లందరినీ సురక్షింతగా కాపాడారు.