top of page
Suresh D

75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 75 లక్షల మంది మహిళల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉజ్వల పథకం రెండో దశకు ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 75 లక్షల మంది మహిళల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉజ్వల పథకం రెండో దశకు ఆమోదం తెలిపింది. దీని కింద కొత్తగా 75 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం 9.60 కోట్ల మంది మహిళలు ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కొత్త ఉచిత LPG కనెక్షన్ల పంపిణీ తర్వాత, లబ్దిదారుల సంఖ్య 10 కోట్లు దాటుతుంది.రానున్న మూడేళ్లలో ఈ 75 లక్షల కనెక్షన్లు పంపిణీ చేస్తామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉజ్వల పథకం కింద, ఉచిత LPG గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌పై ప్రతి కనెక్షన్‌కు ప్రభుత్వం 2,200 రూపాయల సబ్సిడీని ఇస్తుంది. ఇందుకు ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.1,650 కోట్లు వెచ్చించనున్నారు. మొదటి సిలిండర్‌ను ఉచితంగా నింపడంతోపాటు ఉచితంగా గ్యాస్‌ స్టవ్‌ను అందించడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని పెట్రోలియం కంపెనీలు భరిస్తాయి.


bottom of page