top of page

దీపికా పదుకొనే మెడపై 82°E టాటూ అర్ధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే రీసెంట్ గా ఆస్కార్ వేడుకల్లో సందడి చేసింది . అయితే అందమైన బుట్టబొమ్మను చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్... కాని ఆమె మెడపై ఉన్న టాటూని మాత్రం చాలామంది గుర్తించలేదు. ఇంతకీ ఎంటా టాటూ. దాని అర్దం ఏంటి.?

ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో మెరుపులు మెరిపించింది బాలీవుడ్ భామ దీపికా పదుకొనే. హాలీవుడ్ లో సందడి చేసిన దీపికా రెడ్ కార్పెట్ పై ఆమె ఇచ్చిన పోజులకు ఫిదా అయ్యారు హాలీవుడ్ స్టార్స్. ఇక ఆమె ఆస్కార్ లో చేసిన సందడికి సబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. . ముఖ్యంగా దీపిక డ్రస్ అందరిని ఆకర్షించింది. ఆమె ప్రసెంటర్ గా ఆస్కార్ వేదిక మీదకు రాగానే.. ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నా దీపికా మెడపై ఓ టాటూ ఉంది. దీనిని చాలా మంది గమనించలేదు. దీపికా పదుకొణే ఆమె మెడపై ఉన్న టాటూ అందరినీ ఆకర్షించింది. ఆమె మెడపై 82°E అనే టాటూను వేయించుకుంది. అయితే అసలు 82°E కి అర్ధం ఏంటి..? అసలు అది మెడపై దీపికా ఎందుకు టాటూగా వేయించుకుంది అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది నెటిజెన్లు ఇంటర్నెట్ లో ఈ విషయంపై సెర్చ్ చేశారు. చేస్తున్నారు. అయితే చాలా మంది అంచనాల ప్రకారం 82°E అంటే '82 డిగ్రీస్ ఈస్ట్' అని అర్థం. 82°E అనేది ఆమె కొత్తగా మొదలుపెట్టిన స్కిన్ కేర్ బ్రాండ్ పేరు. చాలా మంది స్టార్స్ ఇప్పటికే సినిమాలతో పాటు.. బిజినెస్ లు కూడా చేసుకుంటున్నారు. హీరోయిన్లు ఎక్కువగా బొటిక్ లు, జూవ్వెల్లరీ బిజినెస్ ల వైపు వెళ్తున్నారు. ఇక దీపికా కూడా కొన్ని నెలలుగా ఈ బ్రాండ్ పేరు మీద స్కిన్ కేర్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. సో... తన పొంత ప్రాడక్ట్ ను దీపిక టాటూగా వేయించుకుంది. ప్రస్తుతం దీపికా గ్లామర్ తో పాటు.. ఆమె మెడపై ఈ టాటూ కూడా వైరల్ అవుతుంది. ఈ టాటూపై నెటిజన్లురకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆస్కార్ వేదికపై దీపికా పదుకొనే ప్రజెంటర్ గా సందడి చేశారు. ప్రపంచ వేదికపై ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇచ్చారు దీపికా. చిరునవ్వులు చిందిస్తూ.. స్టేజ్ మీదకు వచ్చి.. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ పెర్ఫామెన్స్ కు సబంధించిన అనౌన్స్ మెంట్ ను చేశారు దీపికా. ఈ సాంగ్ ను అనౌన్స్ చేస్తుండగానే హాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది చూసి.. ఆడియన్స్ ఎక్స్ ప్రెషన్స్ కు దీపికా ఎంతో సంతోషించింది. మధ్యలో ఆగుతూ.. ఆడియన్స్ కు అరిచే స్పేస్ ఇచ్చి మరీ.. ఆర్ఆర్ఆర్ ను అనౌన్స్ చేశారు దీపికా పదుకునే.

ఇక పెళ్ళి తరువాత కూడా వరుస సినిమాలతో సందడి చేస్తుంది దీపికా పదుకునే. రణ్ వీర్ సింగ్ ను పెళ్ళాడిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో లిప్ లాక్ లు.. బెడ్ సీన్స్ కు వెనకాడటం లేదు. సినిమా డిమాండ్ చేసే ఎంత వరకూ చేయడానికైనా రెడీ అంటోంది. ఇక ఆమధ్య ఓ సినిమాలో ముద్దులతో రెచ్చిపోయింది బ్యూటీ. ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది. ఇక షారుఖ్ జోడీగా దీపికా పదుకొనే నటించిన పఠాన్ మూవీ బాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.



 
 
bottom of page