900వ గోల్ కొట్టిన క్రిస్టియానో రోనాల్డో
- MediaFx
- Sep 6, 2024
- 1 min read
స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డ్.. తన కెరీర్‌లో 900వ గోల్ చేశాడు. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో రోనాల్డ్ ఆ అరుదైన ఘనతను అందుకున్నాడు. యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1 గోల్స్ తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది. 39 ఏళ్ల రోనాల్డో 900వ గోల్ కొట్టిన తర్వాత భావోద్వేగానికి లోనయ్యాడు. పోర్చుగల్ తరపున రోనాల్డోకు అది 131వ గోల్ కావడం విశేషం. రోనాల్డ్ కొట్టిన సగం గోల్స్ లో.. అతను రియల్ మాడ్రిడ్ తరపున చేశాడు. స్పోర్టింగ్ లిస్బన్, మాంచెస్టర్ యునైటెడ్, అల్ నాసర్ జట్ల తరపున కూడా అతను గోల్స్ చేశాడు. రోనాల్డో తన ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశాడు. ఇలా జరుగుతుందని కల కన్నట్లు పేర్కొన్నాడు. తనకు ఇంకా ఎన్నో కోరికలు కూడా చెప్పాడు. తనకు సహకరించిన వారికి ఆయన థ్యాంక్స్ తెలిపారు.