దేవుడి సినిమాకు ‘A’ సర్టిఫికేట్..
- Suresh D
- Aug 1, 2023
- 1 min read
సాధారణంగా దేవుడి నేపథ్యంలో వచ్చే చిత్రాలకు క్లీన్ యూ సర్టిఫికేట్ లేదా యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వడమో చూస్తాం. కానీ 'ఓ మై గాడ్-2' సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సాధారణంగా దేవుడి నేపథ్యంలో వచ్చే చిత్రాలకు క్లీన్ యూ సర్టిఫికేట్ లేదా యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వడమో చూస్తాం. కానీ 'ఓ మై గాడ్-2' సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక దేవుడు సినిమాకు 'ఏ' సర్టిఫికేట్ ఇదే తొలిసారి. అంతలా అడల్ట్ కంటెంట్ ఏముందని సినీ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ముందుగా ఈ మూవీ చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్రయూనిట్‌కు ఏకంగా 20 కట్స్‌ను రికమెండ్ చేశారు. దీనికి ఒప్పుకోని నేపథ్యంలో ఏ సర్టిఫికేట్‌ను ఇస్తామని నిర్మాతలకు సెన్సార్ బోర్డు ముందే చెప్పిందట. అయితే మూవీ మేకర్స్ ఆ కట్స్ కు నిరాకరించడంతో ఏ సర్టిఫికెట్ జారీ చేసిందట. ఈ సినిమా రన్‌టైమ్ 2గంటల 36 నిమిషాలు ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు.