top of page
MediaFx

డ్రైవర్ లేకుండానే రోడ్డుపై రివర్స్‌లో దూసుకెళ్లిన వ్యాన్..


పూణెకు చెందిన ఓ మున్సిపల్ కార్పొరేషన్.. రోడ్ మెయిన్‌‌టెనెన్స్‌కి సంబంధించిన ఓ వ్యాన్.. రోడ్డుపై ఆపి ఉంచారు. ఆ వ్యాన్ లోపల డ్రైవర్ కూడా లేడు. మరి ఎలా జరిగిందో తెలీదు కానీ.. ఆగి వున్న వ్యాన్ ఉన్నట్టుండి.. రివర్స్‌లో స్పీడుగా వెళ్లి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టి నిలిచి పోయింది. ఈ ఘటన అర్థరాత్రి సుమారు 11.45 నిమిషాల సమయంలో జరిగింది. ఆ సమయంలో రోడ్డుపై రద్దీ లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. రోడ్డుకు ఇటువైపు ఉన్నవారు ఈ సంఘటనను వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒకింత షాక్‌కి గురవుతున్నారు. అయితే ఈ వీడియోపై పౌర సంఘం నుండి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కాగా పూణేలో మద్యం మత్తులో ఉన్న 17 ఏళ్ల కుర్రాడు తన పోర్స్చే కారును ఢీ కొట్టడంతో 24 ఏళ్ల ఇద్దరు టెక్కీలు తక్షణమే మరణించిన నెల రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.



bottom of page