top of page
MediaFx

OTTలోకి పుష్ప విలన్ 'ఆవేశం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?


టాలెంటెడ్ యాక్టర్ ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. ఈ చిత్రం నటుడి కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం కి ఓపెనింగ్స్ బాగా రావడంతో లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. దాదాపు 150 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు సాధించి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. డబ్బింగ్ వెర్షన్ ల గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. జిత్తు మాధవన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ లు కీలక పాత్రల్లో నటించారు. అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫాహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ ఈ చిత్రంను సంయుక్తంగా నిర్మించారు. సుశిన్ శ్యామ్ సంగీతం అందించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.


bottom of page