పశ్చిమగోsaదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేశారు. ప్రత్యేక పాత్రల్లో అభిషేకం చేయకుండా అల్కహాల్ సీసాలతో చేయడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఈ కొత్తరకం సంప్రదాయం ఏంటని బాబా భక్తులు మండిపడుతున్నారు. 🍺🍶🙏🏽
దేవుడి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేయడం సంప్రదాయం. పాలు, తేనే, పంచదార, పళ్ల రసాలను ప్రత్యేక పాత్రల్లో నింపి దేవుడికి అభిషేకం చేస్తారు. కానీ వేమవరంలో మాత్రం అందుకు విరుద్దంగా గ్రామస్థులు వ్యవహరించారు. బీరు బాటిళ్లు, విస్కీ సీసాలలో ద్రవ్యాలను పోశారు. వాటితోనే అభిషేకం చేశారు. లిక్కర్ సీసాలతో అభిషేకంపై భక్తులు మండిపడుతున్నారు. ఇలా చేయడం దేవుడ్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 🍺🍶🙏🏽