బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూర్చేలా బచ్చన్ ఫ్యామిలీ వ్యవహరించడంతో అందరూ ఇది నిజమే అని నిర్థారణకు వచ్చేశారు. ఇదే సమయంలో బిగ్ బి అమితాబ్ తన కొడలు ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు.
ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని.. అందుకే అమితాబ్ ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని చర్చించుకున్నారు. తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. విడాకుల వార్తలపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. అవును మేము నిజంగానే విడాకులు తీసుకున్నాం అని బాంబు పేల్చారు.
దీనిపై అభిషేక్ మాట్లాడుతూ..మా విడాకులు నిజమే.. ఈ విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఆ తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండంటూ కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఐశ్వర్యకు నాకు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి.. ఎలా బతకాలి అనేది పూర్తిగా తెలుసు. ఎవరో మూడో వ్యక్తి మా జీవితంలోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ అభిషేక్ తెలిపారు. నాకు ఐశ్వర్య పై ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలుసు.. ఆమెకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు.. మా ప్రేమ గురించి మీకు తెలియజేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
మీడియా వాళ్ళు చెప్పే దాని మీదనే నా లైఫ్ నడవాలి అంటే నడవదు.. నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. మీడియాలో వచ్చిన రూమర్స్ ని నేను పట్టించుకోను. అందుకే విడాకుల రూమర్స్ పై ప్రతిసారి స్పందించలేనంటూ తన విడాకుల వార్తలను ఖండించారు అభిషేక్ బచ్చన్. ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ జంట 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప ఉంది.