top of page
MediaFx

ఎయిర్‌టెల్, జియోకు పెద్ద దెబ్బ..


భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు అనేక నగరాల్లో హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. వారి రీఛార్జ్ ప్లాన్‌లు వివిధ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా కలిగి ఉంటున్నాయి. ఈ ప్లాన్స్ కస్టమర్‌లను మరింత ఆకర్షిస్తున్నాయి. అయితే ఇటీవల రీచార్జ్ ప్లాన్స్ ధరల పెరుగుదల తర్వాత చాలా మంది బీఎస్ఎన్ఎల్ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను  అందిస్తుందని, తమ సిమ్స్‌ను బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ చేసుకున్నార. ఈ విషయం పక్కన పెడితే జియో, ఎయిర్‌టెల్ లేదా మరేదైనా ప్రైవేట్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బాటలోనే బీఎస్ఎన్ఎల్ కూడా నడుస్తుంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌ని ఉపయోగించే వినియోగదారులు ఇకపై జీ-5, సోనీ లివ్, యప్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, షీమారోమీ, హంగామా, లయన్స్ గేట్ ప్లే, ఎపిక్ ఆన్ వంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్లను పొందవచ్చు. అయితే బీఎస్ఎన్ఎల్ ఓటీటీ ప్లాన్‌లు స్వతంత్ర ప్లాన్‌లుగా అందుబాటులో ఉన్నాయి. అంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు అవసరమైన వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లు రూ. 49 నుంచి ప్రారంభమై రూ. 250 వరకు ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ సేవలను సినిమా ప్లస్ అని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ప్రయోజనాలు 

ఈ ఒకే ఒక్క ప్లాన్‌తో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సభ్యత్వాలను అందిస్తుంది.

ఈ ప్లాన్ ద్వారా పొందే సేవలను పీసీ/ల్యాప్‌టాప్, మొబైల్, ట్యాబ్, స్మార్ట్ టీవీలతో సహా ఏ సమయంలోనైనా, ఏ పరికరంలోనైనా ఉపయోగించవచ్చు

ఎంచుకున్న ప్యాక్ ఆధారంగా అన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్‌కు సంబంధించిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో యాక్టివేట్ చేయబడతాయి. వినియోగదారుల బిల్లులో చందా రుసుము వసూలు చేస్తారు.

బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ప్లాన్స్ ఇలా

రూ. 49 సినిమా ప్లస్ ప్లాన్ కింద  వినియోగదారులు షేమారో, హంగామా, లయన్స్‌గేట్, ఎపిక్ ఆన్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. 

రూ. 119 సినిమా ప్లస్ ప్లాన్ కింద  జీ-5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, యప్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. 

రూ. 249 సినిమా ప్లస్ ప్లాన్ కింద  జీ-5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, యప్ టీవీ, షీమారో, హంగామా, లయన్స్ గేట్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. 

bottom of page