రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..🚨
- Shiva YT
- Jan 19, 2024
- 1 min read
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం మణిపుర్ నుంచి ప్రారంభమైంది. ప్రారంభమైన అయిదు రోజులకే కేసు నమోదైంది.
గురువారం అస్సాంలోని జోర్హాట్ పట్టణంలో అనుమతి లేని ప్రదేశం మీదుగా యాత్ర చేశారంటూ యాత్ర నిర్వాహకులు కేబి బైజుపై కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో యాత్రకు అనుమతి ఇచ్చిన కేబీ రోడ్ వైపు వెళ్లకుండా పట్టణంలోని మరో మార్గం గుండా యాత్ర సాగినందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. దీంతో ఆ ప్రాంతమంతా అస్తవ్యస్తమైనట్లు చెప్పారు. రాహుల్ అటువైపుగా పాదయాత్ర చేయడంతో ఒక్కసారిగా ప్రజలు యాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కారణంగానే యాత్రపై, దాని నిర్వాహకులపై సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కేబీ బైజు తెలిపారు. యాత్ర నిర్వహించే జిల్లా యాంత్రాంగం నిబంధనలను పాటించలేదని, రహదారి భద్రతా నియమాలను ఉల్లంఘించారని ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు. 🚓