లావణ్య కేసులో నటుడు రాజ్ తరుణ్‌కు హైకోర్టులో ఊరట..
- MediaFx
- Aug 8, 2024
- 1 min read
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అతడికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనను మోసం చేశాడు అంటూ లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. లావణ్య ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. అయితే దీనిపై రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే.. రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఇటీవల ‘పురుషోత్తముడు’ ‘తిరగబడరసామీ’ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాజ్ తరుణ్. వారం గ్యాప్‌లో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచాయి.