చెన్నైలో వాతావరణం వాతావరణం మారింది. వర్షాలతో అంతా అతలాకుతలం అవుతుంది. మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాట భారీ వర్షాలతో అక్కడ అనేక ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది.
చెన్నైలో వాతావరణం వాతావరణం మారింది. వర్షాలతో అంతా అతలాకుతలం అవుతుంది. మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాట భారీ వర్షాలతో అక్కడ అనేక ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేలరాలుతున్నాయి. నదులు పొంగి పోలుతుండటంతో చాలా మంది నివాసాలు కోల్పోయారు. చివరకు రోడ్ల పై ఉన్న కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మిచౌంగ్ దెబ్బకు చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ భారీవర్షాల కారణంగా 8 మంది మృతి చెందారని తెలుస్తోంది. అలాగే పలు ప్రధాన నగరాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు.
వర్షాల దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ నేటితో నిండిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో జనం పడరాని పట్లు పడుతున్నారు. మరోవైపు NDRF, SDRF బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉంటే వరద బాధితులను ఆదుకునేందుకు స్టార్ సూర్య ముందుకు వచ్చారు.
హీరో సూర్య , ఆయన తమ్ముడు కార్తీ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ ఇద్దరు కలిసి 10లక్షల రూపాయిల ఆర్థిక సాయం అందించినట్టు తెలుస్తోంది. సూర్య ఇప్పటికే పలు సేవ కార్యక్రమాలు, ఆర్ధిక సహాయాలులాంటివి చేశారు. 🌧️🚨