top of page
Suresh D

‘యానిమల్’ చూస్తే ఏం కాలేదు కానీ నా సినిమా చూస్తే మాత్రం..🎥✨


సిద్దార్థ్ చాలా కాలం పాటు సరైన హిట్టు కోసం కష్టపడ్డాడు. చివరకు చిత్తా (తెలుగులో చిన్నా) అనే సినిమాతో సిద్దార్థ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. సిద్దార్థ్ తీసి, నటించిన చిన్నా మూవీ అందరినీ కదిలించింది. ప్రస్తుతం చిన్న పిల్లల మీద జరిగే అత్యాచారాలు, ఘోరాలను బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా సినిమాను తీశారు. ఈ మూవీని చూసి చాలా మంది కదిలిపోయారు. అలాంటి ఈ మూవీని నిర్మించి, నటించి సిద్దార్థ్ ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు. కమర్షియల్‌గానూ ఈ మూవీ అదిరిపోయింది.

ఇక తాజాగా చిన్నా మూవీకి గానూ తనకు వచ్చిన అవార్డును తీసుకుని.. అనంతరం స్టేజ్ మీద మాట్లాడాడు. ఆ మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌కు దారి తీస్తున్నాయి. మామూలుగానే తమిళ సెలెబ్రిటీలు, క్రిటిక్స్‌కు యానిమల్ అంతగా ఎక్కలేదు. యానిమల్ మీద ఎప్పుడూ ఏదో ఒక విమర్శ చేస్తూనే వచ్చారు. రాధిక, కుష్బూ, కస్తూరి వంటి వారంతా కూడా బహిరంగంగానే యానిమల్ మూవీని ఏకిపారేశారు.

ఇక సిద్దార్థ్ తాజాగా మాట్లాడుతూ.. మృగం (యానిమల్) లాంటి సినిమాలు చూసినప్పుడు మగవారికి ఎలాంటి ఫీలింగ్ కలగలేదు.. కానీ నా సినిమా చూసినప్పుడు మాత్రం చాలా డిస్టర్బెన్స్‌గా ఫీల్ అయ్యామని చెబుతున్నారు.. ఏ అమ్మాయి, మహిళ వచ్చి కూడా అలా చెప్పలేదు.. చిత్తా మూవీని చూసి డిస్టర్బెన్స్‌ అయ్యామని చెప్పలేదు.. కానీ మగవాళ్లు చెబుతున్నారు.. అది నిజానికి డిస్టర్బెన్స్ కాదు.. గిల్టీ, సిగ్గుచేటు.. మున్ముందు అందరి మైండ్‌ సెట్‌లు మారతాయన్నట్టుగా చెప్పుకొచ్చాడు.ఇలా యానిమల్ గురించి ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేస్తూనే వస్తున్నారు. కానీ ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 800 కోట్లు కొల్లగొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచిందన్న సంగతి తెలిసిందే.🎥✨

bottom of page