టాలీవుడ్ నటి హేమ ఇటీవల రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయ్యి వార్తల్లో నిలిచారు. తాను రేవ్ పార్టీకి వెళ్ళలేదని, హైదరాబాద్ లోనే ఉన్నాను అని హేమ తప్పించుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు విచారణ ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.
బెయిల్ పై బయటకు వచ్చిన హేమ అరెస్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన హేమ, ఇటీవల రేవ్ పార్టీలో ఇరుక్కొని పాపులర్ అయ్యారు. ఆమె సంపాదించిన వందల కోట్లు ఎలా వచ్చాయి? బీఎండబ్ల్యూ కారు ఎలా కొన్నది? అనేవి అందరి సందేహాలు.
ఒక ఇంటర్వ్యూలో హేమ ఈ విషయంపై మాట్లాడారు. తనకు వందల కోట్ల ఆస్తి లేదని, కేవలం సినిమాల మీదే ఆధారపడడం లేదని, తమ ఫ్యామిలీ మొదటి నుంచి రిచ్ అని, తన సంపాదనకు సినిమాలు మాత్రమే కారణం కాదని చెప్పారు. ఊర్లో తమకు చాలా ఆస్తులు ఉన్నాయని, భర్త కూడా బాగా సంపాదిస్తాడని, తాను కూడా వ్యాపారాలు చేస్తానని తెలిపారు.
అలాగే తాను లగ్జరీ లైఫ్ కోసం కాదు, గంజి నీళ్లు తాగి బ్రతికే వాడిని అని, కార అడవిలో వదిలినా దర్జాగా బతుకుతా అని చెప్పిన హేమ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.