top of page
MediaFx

చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాను..


లేడీ కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నవ్వించి మెప్పించింది కోవై సరళ. ఒకప్పుడు కోవై సరళ సినిమాలో ఉందంటే నవ్వులు పూయాల్సిందే.. ముఖ్యంగా బ్రహ్మనందం, కోవై సరళ కాంబినేషన్ సూపర్ హిట్ అనే చెప్పాలి ఈ ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న కోవై సరళ ఇప్పుడు సినిమాలు తగ్గించారు. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన కోవై సరళ ఇప్పుడు తమిళ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ఇటీవలే బాక్ అనే సినిమాలో నటించారు కోవై సరళ. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు కోవై సరళ. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్ కు వచ్చారు. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు కోవై సరళ. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు అలీ టాక్ షోలో పాల్గొన్నారు కోవై సరళ. ఈ షోలో కోవై సరళ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఎప్పుడు నవ్వులు పువ్వులు పూయించే కోవైసరళ ఈ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు కోవై సరళ. ఆమె మాట్లాడుతూ.. మేము మొత్తం నలుగురు సిస్టర్, ఇద్దరు బ్రదర్స్. అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఒకసారి నేను ఊటీలో షూటింగ్ చేస్తుండగా.. మా నాన్నగారు చనిపోయారని తెలిసింది. అప్పుడు మేము ఓ పాట షూట్ చేస్తున్నాం. నేను ఆ పాటలో బ్యాండ్ వాయిస్తూ సందడి చేయాలి. నాన్న చనిపోయారని విషయం తెలిసిన నేను డాన్స్ చేశా.. ఎందుకంటే ఆ సినిమా చాలా చిన్నది. పైగా సినిమాలో నటించిన అందరూ అక్కడ ఉన్నారు.

నేను సడన్ గా వెళ్ళిపోతే షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది నిర్మాతలకు నష్టం వస్తుంది. అందుకే షూటింగ్ పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళాను. కానీ మా నాన్న చివరి చూపుకు నేను నోచుకోలేకపోయాను అని కన్నీళ్లు పెట్టుకున్నారు కోవై సరళ. అయితే తన బంధువులంతా తనను విమర్శించారని, నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు అని అన్నారు కోవై సరళ.

bottom of page