top of page
Suresh D

ఆ ఫోటోలు షేర్ చేయకండి.. కన్నీళ్లు పెట్టుకున్న నటి🎥✨

టాలీవుడ్ హీరోయిన్ ‘ముంతాజ్’ గురించి తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామరెస్ డాల్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ టీనేజ్ లో ఉండగానే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. అలా ఒకేసారి ముంతాజ్.. దాదాపు తెలుగు, తమిళ్ , మలయాళ భాషల్లో ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే నటిగా కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో ముంతాజ్.. పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసింది. అలా నటనకు దూరమైన ముంతాజ్ పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే.. ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ముంతాజ్ .. తన అభిమానులకు ఓ సహాయం చేయాలని కోరింది. ఇంతకి అదేమిటంటే..

సినిమా ఫీల్డ్ వదిలేసిన ముంతాజ్ పూర్తిగా దేవుడి స్మరణలోనే కాలం వెల్లదీస్తుంది. అయితే సినిమాల్లో నటించనప్పటికి ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోల్ పోస్ట్ చేస్తూ తన అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ.. తనకో సహాయం చేయాలని అభిమానులను కోరింది. అందులో.. నా గతమేంటో ఈ జనరేషన్ పిల్లలకు తెలియదు. అలాగే నేనెవరో అని వారు తెలుసుకోవాలంటే గూగుల్ చేస్తారు. కానీ. నేను ఏం చేసిన నా గతాన్ని మార్చలేను. అలాగే నా గ్లామరస్ ఫోటోలు వారు చూడొద్దని నేను వారిని కోరుకుంటున్నాను. ఒకవేళ నేను బాగా డబ్బు సంపాదిస్తే నా మూవీ రైట్స్ అన్నీ కొనేసి.. వాటిన్నింటిని రిమూవ్ చేయిస్తా. అయితే అది జరగదనే విషయం నాకు తెలుసు. కాబట్టి, ఒకవేళ నేను చనిపోతే.. నా బ్యాడ్ ఫోటోస్ దయచేసి షేర్ చేయొద్దు ప్లీజ్. అలా చేస్తే నా మనసు ఎంతగానో బాధపడుతుంది అని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ముంతాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.🎥✨

bottom of page