top of page

పార్లమెంట్ ఎన్నికల బరిలో హీరోయిన్ పోటీ..? 😲

Suresh D

తాజాగా పశ్చిమ బెంగాల్‌ లోని 14 లోక్ సభ స్థానాలకు సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ అర్చనా బెనర్జీ పేరు కూడా ఉంది. హుగ్లీ లోకసభ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగనుంది. బెంగాల్ కు చెందిన రచనా బెనర్జీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. బావగారు బాగున్నారా, పిల్ల నచ్చింది, మావిడాకులు, సుల్తాన్, కన్యాదానం లాహిరి లాహిరి లాహిరిలో తదితర హిట్ సినిమాల్లో రచన హీరోయిన్ గా నటించింది. అలాగే బెంగాలీ, తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. ప్రస్తుతం బెంగాలీ సీరియల్స్ తో పాటు టీవీ రియాల్టీ షోలకు యాంకర్, జడ్జిగానూ వ్యవహరిస్తోంది. ఇప్పుడు మొదటి సారిగా పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యిందీ అందాల తార. 😮



bottom of page