top of page
MediaFx

అదిరిపొయే అప్డేట్ ఇచ్చిన జక్కన..

టాలీవుడ్ కు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాత సినిమా ఒకటి రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

నితిన్ కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సై’ 2004లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 4కె ఫార్మాట్ లో రీరిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఈ సినిమాలో నితిన్ ప్రేయసిగా జెనీలియా దేశ్ ముఖ్ నటించింది. శశాంక్, ప్రదీప్ రావత్, వేణుమాధవ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎ. భారతి నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి బాణీలు సమకూర్చారు.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు హిట్ పడక చాలా రోజులవుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళితో చేసిన విడుదల అవుతుండటంతో నితిన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2004లో  విడుదలైన సై సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ భారీ కలెక్షన్లు  రాలేదు. కానీ యూత్ లో ఈ మూవీ మంచి క్రేజ్ సంపాదించింది. అయితే రాజమౌళి చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినప్పటికీ సై మాత్రం పెద్దగా ప్లస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ రీరిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు విడుదలైన మంచి కలెక్షన్లు సాధించాయి. పోకిరి, సింహాద్రి లాంటి సినిమాలు అభిమానుల అలరించడంతో రీరిలీజ్ లోనూ భారీ కలెక్షన్లు సాధించాయి. ఇతర సినిమాల కంటే మొదటిరోజు ఊహించని కలెక్షన్లు సాధించి ఆశ్చర్యపర్చాయి. ఈ నేపథ్యంలో సై మూవీ ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

bottom of page