top of page
Suresh D

ముగ్గురు ఆటగాళ్లపై నిషేధం ఎత్తివేత.. ఐపీఎల్‌లో ఆడేందుకు లైన్ క్లియర్..🇦🇫🏏

ఇప్పుడు ముగ్గురు ఆటగాళ్ల నుంచి క్లారిటీ అందుకున్న ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు.. గతంలో విధించిన ఆంక్షలను పూర్తిగా మార్చేసింది. సవరించిన పరిమితులు ఈ ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్ట్‌లను అంగీకరించడానికి, ఫ్రాంచైజీ లీగ్‌లలో పాల్గొనడానికి అనుమతిస్తాయి.

ఆఫ్ఘనిస్థాన్‌ ఆటగాళ్లు నవీన్‌ ఉల్‌ హక్‌ (Naveen-ul Haq), ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, ఫజల్‌హక్‌ ఫరూఖీలపై విధించిన ఆంక్షలను ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు రద్దు చేసింది. దీని కారణంగా ఈ ముగ్గురు ఆటగాళ్లు IPL సహా ప్రపంచంలోని ప్రధాన లీగ్‌లలో పాల్గొనవచ్చని తెలిపింది. ఇంతకుముందు, ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడేందుకు నవీన్-ఉల్-హక్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూఖీలకు నో-అబ్జెక్షన్ లెటర్స్ ఇవ్వడానికి ఏసీబీ నిరాకరించింది.

ఈ ముగ్గురు ఆటగాళ్లను ఆఫ్ఘన్ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి విడుదల చేయాలనుకున్నారు. లీగ్‌లో పాల్గొనేందుకు ఫ్రాంచైజీ ఈ నిర్ణయానికి వచ్చిందని కూడా ఆరోపణలు వచ్చాయి. అందువల్ల, లీగ్ క్రికెట్ ఆడేందుకు ఎన్‌ఓసీ ఇవ్వకూడదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.

దీని ప్రకారం, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫరూకీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లను రాబోయే 2 సంవత్సరాల పాటు ఐపీఎల్ సహా ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడటానికి అనుమతించబోమని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

ఇప్పుడు ముగ్గురు ఆటగాళ్ల నుంచి క్లారిటీ అందుకున్న ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు.. గతంలో విధించిన ఆంక్షలను పూర్తిగా మార్చేసింది. సవరించిన పరిమితులు ఈ ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్ట్‌లను అంగీకరించడానికి, ఫ్రాంచైజీ లీగ్‌లలో పాల్గొనడానికి అనుమతిస్తాయి. నిషేధం ఎత్తివేయడంతో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్‌లో కనిపించడం ఖాయమైంది. దీని ప్రకారం నవీన్ ఉల్ హక్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున, ఫజల్ హక్ ఫరూఖీ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడనున్నారు. అలాగే, ముజీబ్ ఉర్ రెహ్మాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్నాడు.🇦🇫🏏

bottom of page