top of page

డిసెంబర్ లో పుష్ప 2తో ఢీకొట్టనున్న గేమ్‌ఛేంజర్‌!


గేమ్‌ ఛేంజర్‌ కీలక అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు. : రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రస్తుతం ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు బిజీగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదల పైన రామ్ చరణ్ అభిమానులతో పాటు, సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు గేమ్‌ ఛేంజర్‌ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు.


పుష్ప 2 తో ఢీకొట్టనున్న గేమ్‌ ఛేంజర్‌ ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం రాయన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ విడుదల తేదీని చెప్పేశారు. ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా తీసుకురాబోతున్నట్టు దిల్ రాజు ప్రకటించారు . అయితే క్రిస్మస్ కు అల్లు అర్జున్ పుష్ప 2 థియేటర్లలో సందడి చేస్తుంది. ఒకే నెలలో ఇద్దరి సినిమాలు రిలీజ్ కానున్న క్రమంలో పుష్ప 2 తో గేమ్‌ ఛేంజర్‌ ఢీకొట్టనుంది. అల్లు అర్జున్ , రాం చరణ్ మధ్య సినిమాల చిచ్చు ఇక రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరి సినిమాలు డిసెంబర్ లో కొట్లాటకు సిద్ధమవుతున్న వేళ ఈ సినిమాలలో ఎవరి సినిమా పై చేయిగా నిలుస్తుంది అన్నది ఫ్యాన్స్ లో ఉత్కంఠకు కారణమైంది. ఏది ఏమైనా ఇద్దరు హీరోల మధ్య మరో మారు సినిమాల రిలీజ్ చిచ్చు పెడుతుందని టాక్ వినిపిస్తుంది.









 
 
bottom of page