ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో జియో ఎంట్రీ తర్వాత రీచార్జ్ ధరలు అందుబాటులోకి రావడంతో మొబైల్ వాడకం తారాస్థాయికు చేరింది. జియో దెబ్బకు ప్రత్యర్థి కంపెనీలకు కూడా తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ భారతదేశంలో టాప్ ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లుగా మారాయి. అయితే తాజాగా ఈ రెండు కంపెనీలు తమ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించాయి. డేటా, అపరిమిత కాలింగ్ ఎస్ఎంఎస్ సేవలతో సహా ఒకే ప్రయోజనాలను కొనసాగిస్తూ రెండు కంపెనీలు తమ టారిఫ్‌లను సర్దుబాటు చేశాయి. జూలై 3 నుంచి రిలయన్స్ జియో కొత్త టారిఫ్ ప్లాన్లు 22 శాతం వరకు పెరగనున్నాయి. అయితే ఎయిర్‌టెల్ రేట్లు సుమారు 15 శాతం పెరుగుతాయి. ఈ నేపథ్యంలో మీరు రీచార్జ్ చేయించుకునే ప్లాన్స్ ఏ స్థాయిలో పెరిగాయో? ఓసారి తెలుసుకుందాం.
నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్లు
జియో రూ. 155 ప్లాన్ ఇప్పుడు రూ. 189, 28 రోజుల పాటు 2 జీబీ డేటా మరియు అపరిమిత కాలింగ్‌ను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 179 ప్లాన్ ఇప్పుడు రూ. 199, 28 రోజుల పాటు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
జియో రూ. 209 ప్లాన్ ఇప్పుడు రూ. 249గా మారింది. 1 జీబీ/రోజు, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను 28 రోజుల పాటు అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 265 ప్లాన్ ఇప్పుడు రూ. 299గా మారింది. 1 జీబీ/రోజు, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను 28 రోజుల పాటు అందిస్తుంది.
జియో రూ. 239 ప్లాన్ ఇప్పుడు రూ. 299, 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.
జియో రూ. 239 ప్లాన్ ఇప్పుడు రూ. 299గా మారింది. 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్ ఇప్పుడు రూ. 349గా ఉంది. 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
జియో రూ. 299 ప్లాన్ ఇప్పుడు రూ. 349గా మారింది. 28 రోజుల పాటు రోజుకు 2 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 359 ప్లాన్ ఇప్పుడు రూ. 409, 28 రోజుల పాటు రోజుకు 2.5 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
జియో రూ. 399 ప్లాన్ ఇప్పుడు రూ. 449గా మారింది. 28 రోజుల పాటు రోజుకు 3 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 399 ప్లాన్ ఇప్పుడు రూ. 449గా మారింది. 28 రోజుల పాటు రోజుకు 3 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
రెండు నెలల ప్రీపెయిడ్ ప్లాన్లు
జియో రూ. 479 ప్లాన్ ఇప్పుడు రూ. 579గా మారింది. 56 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 479 ప్లాన్ ఇప్పుడు రూ. 579, 56 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
జియో రూ. 533 ప్లాన్ ఇప్పుడు రూ. 629గా మారింది. 56 రోజుల పాటు రోజుకు 2 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 549 ప్లాన్ ఇప్పుడు రూ. 649గా మారింది. 56 రోజుల పాటు రోజుకు 2 జీబీ , అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
మూడు నెలల ప్రీపెయిడ్ ప్లాన్లు
జియో రూ. 395 ప్లాన్ ఇప్పుడు రూ. 479గా మారింది. 84 రోజుల పాటు 6 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లన అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 455 ప్లాన్ ఇప్పుడు రూ. 509గా మారింది. 84 రోజుల పాటు 6 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
జియో రూ. 666 ప్లాన్ ఇప్పుడు రూ. 799గా మారింది. 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 719 ప్లాన్ ఇప్పుడు రూ. 859గా మారింది. 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
జియో రూ.719 ప్లాన్ ఇప్పుడు రూ. 859గా మారింది. 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 839 ప్లాన్ ఇప్పుడు రూ. 979, 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
జియో రూ. 999 ప్లాన్ ఇప్పుడు రూ. 1199గా మారింది. 84 రోజుల పాటు రోజుకు 3 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.
వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు
జియో రూ. 1559 ప్లాన్ ఇప్పుడు రూ. 1899గా మారింది. 336 రోజుల పాటు 24 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 1799 ప్లాన్ ఇప్పుడు రూ. 1999గా ఉంది. 365 రోజుల పాటు 24 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.
జియో రూ. 2999 ప్లాన్ ఇప్పుడు రూ.3599గా మారింది. రోజుకు 2.5 జీబీ, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను 365 రోజుల పాటు అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 2999 ప్లాన్ ఇప్పుడు రూ. 3599గా మారింది. 2 జీబీ/రోజు, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను 365 రోజుల పాటు అందిస్తుంది.