top of page
MediaFx

మ్యూజిక్ షాప్ మూర్తి నుండి 'అంగ్రేజి బీట్' వీడియో సాంగ్ విడుదల

ప్రభావవంతమైన పాత్రలకు పేరుగాంచిన తెలుగు నటుడు అజయ్ ఘోష్ తన రాబోయే చిత్రం "మ్యూజిక్ షాప్ మూర్తి" లో ప్రధాన పాత్రను పోషించనున్నారు. విలన్ మరియు కామెడీ పాత్రలలో ప్రేక్షకులను అలరించిన అజయ్ ఘోష్ ఈసారి లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఉత్సుకతను రేకెత్తించాయి."మ్యూజిక్ షాప్ మూర్తి" చిత్రం 2024 జూన్ 14న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి "అంగ్రేజి బీట్" వీడియో సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్‌లో విడుదల చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. పవన్ సంగీతం సమకూర్చగా, శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

bottom of page