top of page
Suresh D

మరోసారి గాయపడ్డ హీరో అజిత్..🎥✨

యాక్షన్ సినిమాలంటేనే చాలా రిస్క్. పైగా అందులో డూప్ లేకుండా స్వయంగా హీరోలే నటించడం అంటే అది ఇంకా రిస్క్. కానీ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మాత్రం ఇందుకు భిన్నం.

అది ఎలాంటి రిస్కీ షాట్ అయినా, భారీ స్టంట్ అయినా వెనుకాడకుండా రంగంలోకి దిగిపోతారు. చాలా సందర్భాల్లో ఇలానే గాయాలపాలు కూడా అయ్యారు. ఇక తాజాగా మరోసారి అజిత్ ఇలానే షూటింగ్‌లో గాయపడ్డారు.  ప్రస్తుతం దర్శకుడు మాగిజ్ తిరుమనేనితో 'విడా ముయార్చి' (VidaaMuyarchi) అనే చిత్రంలో నటిస్తున్నారు అజిత్. ఈ షూటింగ్‌ సమయంలో చేసిన ఓ రిస్కీ స్టంట్‌కి సంబంధించిన వీడియోను తాజాగా అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన షూటింగ్ వీడియో ఇది. ఇందులో అజిత్ కార్ నడుపుతూ ఓ ఇంటెన్స్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో రోడ్డుపైన ఆ కారు అదుపు తప్పి పడిపోయింది. దీంతో సిబ్బంది వెంటనే కారు దగ్గరకి వెళ్లి అజిత్ సహా మరో నటుడిని బయటకి తీసే ప్రయత్నం చేశారు. గత ఏడాది నవంబర్‌లో ఈ సంఘటన జరిగినట్లు అజిత్ మేనేజర్ తెలిపారు. అయితే ఈ వీడియో చూసిన తలా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అజిత్ చాలా రిస్క్ తీసుకుంటారని తెలిసిందే కానీ ఈ వీడియో మాత్రం మరో రేంజ్‌లో ఉండటంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అజిత్‌ను రిస్క్ తీసుకోవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం అజిత్ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.🎥✨


bottom of page