top of page
Suresh D

సోనీలివ్ లో 'ఏజెంట్' స్ట్రీమింగ్ డేట్ ఇదే ..🎥🎞️

అఖిల్ హీరోగా రూపొందిన 'ఏజెంట్' సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్ కానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తూ వస్తోంది. అయితే ఓటీటీలో ఈ సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ కి ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతూ వచ్చింది. కానీ తాజాగా మాత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది. 🎥🎞️

'ఏజెంట్' స్ట్రీమింగ్ హక్కులను 'సోనీ లివ్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా కొంతసేపటిక్రితం ప్రకటించారు. అఖిల్ జోడీగా సాక్షి వైద్య నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి, హిప్ హాప్ తమిళ సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ కథ ఫారిన్ లోనే ఎక్కువగా నడుస్తుంది. సురేందర్ రెడ్డి మార్క్ యాక్షన్ సీన్స్ కనిపిస్తాయి. కానీ లవ్ .. రొమాన్స్ . ఎమోషన్స్ కి ఈ కథ దూరంగా వెళ్లింది. అందువల్లనే భారీతారాగణం ఉన్నప్పటికీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. మరి ఓటీటీ ద్వారా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందేమో చూడాలి.🎥🎞️

bottom of page