🚨 మందుబాబులకు అలెర్ట్. భాగ్యనగర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు రెండు రోజుల పాటు మూసి ఉండనున్నాయి. శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం, కల్లు దుకాణాలు..
అలాగే వైన్స్, బార్లు అన్నీ కూడా ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను నిలిపి వేయనున్నారు. 30వ తేదీ పోలింగ్ అనంతరం మద్యం షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నిబంధనను ఎవ్వరూ అతిక్రమించకూడదని.. ఎవరైనా సరే అక్రమంగా మద్యం సేవించినా.. మద్యం నిల్వ చేసినా.. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఎవరైనా కూడా అక్రమంగా మద్యం విక్రయిస్తే.. 8712658750 ఫోన్ నంబర్‌కు ఫిర్యాదు చేయమని కోరారు. అటు హైదరాబాద్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. ఎన్నికల వరకు ఇది కొనసాగుతుందని సీపీ తెలిపారు. ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడొద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు మూడు కమిషనరేట్లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 🚫