top of page

పాన్ ఇండియా ప్రాబ్లమ్ మీద అల్లరి నరేష్ సినిమా.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ గ్లింప్స్..🎥🎭

Suresh D

ఈవీవీ త‌న‌యుడు, టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’. ఈ సినిమాకు మల్లి అంకం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఫరియా అబ్దుల్లా క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది.

‘ఆ ఒక్కటీ అడక్కు’… నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం ఎంతపెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు. 1992లో ఈవీవీ సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం సెటైరికల్‌ కామెడీగా మంచి విజ‌యాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్‌తో మ‌రో సినిమా రాబోతుంది. ఈవీవీ త‌న‌యుడు, టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేష్  న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’. ఈ సినిమాకు మల్లి అంకం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఫరియా అబ్దుల్లా  క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది. 

ఈ మూవీ నుంచి మేక‌ర్స్ తాజాగా టైటిల్ గ్లింప్స్ విడుద‌ల చేశారు. ”పెద్దోడా బయట వాళ్లందరికీ ఏం చెబుతావురా అంటూ వీడియో మొద‌లైంది.. ‘గ‌ణ పెళ్ళెప్పుడు’, ‘గ‌ణ కళ్యాణం ఎప్పో’, ‘గణ షాదీ కబ్ కరోగి’ అంటూ పాన్ ఇండియా డైలాగ్స్‌తో ఈ గ్లింప్స్ సాగింది. ఇక గ్లింప్స్ చూస్తే.. ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. ఇక అల్ల‌రి న‌రేష్ మ‌ళ్లీ త‌న పాత ఫార్ములాతో హిట్ కొట్టేలా ఉన్నట్లు క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

చిలక ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రాజీవ్ చిలక ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత – అబ్బూరి రవి, ఎడిటర్ – చోటా కె ప్రసాద్, డోప్ – సూర్య, సంగీత దర్శకుడు – గోపీ సుందర్, ఆర్ట్ డైరెక్టర్ – జె కె మూర్తి, సహ నిర్మాత – భరత్ లక్ష్మీపతి, దర్శకుడు- మల్లి అంకం.🎥🎭


 
bottom of page