1947 బ్యాక్ డ్రాప్ తో అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ 🎬
- Shiva YT
- Nov 23, 2023
- 1 min read
రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తే జేబు శాటిస్‌ఫేక్షన్ ఉంటుంది. అదే కాస్త డిఫరెంట్‌గా చేస్తే జాబు శాటిస్‌ఫేక్షన్ కూడా బోనస్ అవుతుంది. ఆ బోనస్ కోసం యమాగా ప్లాన్ చేస్తున్నారు బన్నీ అండ్ త్రివిక్రమ్.

ఈ హ్యాట్రిక్ కాంబో చేయబోయే నెక్స్ట్ మూవీ మీద క్రేజీ బజ్ క్రియేటైంది. ఏంటది? చూసేద్దాం వచ్చేయండి...
బన్నీ త్రివిక్రమ్ కాంబో అనగానే ఇద్దరికి ఇద్దరూ సిత్తరాలే చేస్తారని ఫిక్సయిపోతారు ఆడియన్స్. వాళ్ల కాంబోలో వచ్చిన సినిమాలు అలాంటి ఒపీనియన్‌ని క్రియేట్ చేశాయి మరి. అల్లరి, ఎమోషన్స్ , మెసేజ్, ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఫుల్ మీల్స్ లా మూవీని ప్యాక్ చేస్తారు వీరిద్దరూ
అందుకే ఇప్పుడు నెక్స్ట్ సినిమా మీద కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని ఆల్రెడీ ఉన్న హింట్స్ కి ఇప్పుడు ఇంకాస్త క్లారిటీ వచ్చింది. రీజినల్ సినిమాలతోనే రెచ్చిపోయిన డైనమిక్ కాంబో, ప్యాన్ ఇండియా లెవల్లో ప్రెజెంట్ చేసే మూవీకి ఇంకెన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తారోనని ఆడియన్స్ వెయిటింగ్.
ఇండిపెండెన్స్ డే బ్యాక్ డ్రాప్‌లో దాదాపు 300 కోట్లతో మూవీ చేయబోతున్నారట. దీని కోసం ఇప్పటి నుంచి ప్రాక్టికల్స్ మొదలుపెట్టేశారట గురూజీ. ఇప్పుడు మహేష్‌తో చేస్తున్న మూవీని కూడా మరింత లావిష్‌గా, ప్యాన్ ఇండియాకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారట. 🌟🎥👏