top of page
Suresh D

జైలర్‌ డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్ కుమార్ స్టోరీకి అల్లు అర్జున్‌ ఇంప్రెస్‌..!🎥🌟

ఈ ఏడాది తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్‌ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ . ఈ స్టార్ డైరెక్టర్‌ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఇప్పటికే నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో నెల్సన్ దిలీప్ కుమార్‌ సినిమా చేయబోతున్నాడని వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా దీనిపై క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.🎥🌟

ఇటీవలే అల్లు అర్జున్‌ కు నెల్సన్‌ ఓ స్క్రిప్ట్‌ను వినిపించగా.. పాజిటివ్‌గా స్పందించాడట బన్నీ . అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప.. ది రూల్‌ చేస్తున్నాడని తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా బన్నీ లైన్‌లో ఉంది.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో కూడా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశాడు. భూషణ్‌ కుమార్‌ టీ సిరీస్‌, సందీప్‌ హోం బ్యానర్‌ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ 2025లో సెట్స్‌ పైకి వెళ్లనుంది. AA23 ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్‌తో ఉన్న అల్లు అర్జున్ మరి నెల్సన్ దిలీప్‌ కుమార్ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తాడనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది.🎥🌟

bottom of page