top of page
Suresh D

పుష్ప-2 రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం..🎥🌟

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ అయింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ పై చిత్రబృందం నేడు భారీ అప్ డేట్ ఇచ్చింది. పుష్ప-2 వచ్చే ఏడాది ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. బాక్సాఫీసు ఏలడానికి పుష్పరాజ్ మరోసారి వస్తున్నాడంటూ మైత్రీ మూవీ మేకర్స్ తన పోస్టులో పేర్కొంది. రక్తం అంటిన పుష్పరాజ్ చేతిని కూడా పోస్టు చేసింది.🎥🌟


bottom of page