తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి. సామాజిక మాధ్యమాల్లో బన్నీపై మెగా అభిమానులు ట్రోలింగ్ చేస్తుంటే, అల్లు ఆర్మీ కూడా ధీటుగా బదులిస్తోంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం కాస్తా 'పుష్ప2' విడుదల వాయిదా పడేలా చేసింది.
బన్నీకి 'పుష్ప2' ఎంతో ప్రతిష్టాత్మకం. అయితే గత అనుభవాల దృష్ట్యా 'పుష్ప2' డిసెంబరుకు వాయిదా వేసారు. ఎన్నికల సమయంలో పవన్‌కు మద్దతు ఇవ్వకుండా వైసీపీ అభ్యర్థికి బన్నీ మద్దతు ప్రకటించడం విభేదాలకు కారణమైంది.
దీంతో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ బన్నీ జాతకంలో దోషం ఉందేమోనని పరిశీలించారు. అందువల్ల కుటుంబ సభ్యులంతా ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు.అల్లు అర్జున్ తన తల్లి మాటను ఎప్పుడూ కాదనలేదు. ఆమె పూజలు చేయించాలని కోరడంతో ఒప్పుకున్నాడు.