top of page
Suresh D

‘పుష్ప – 2’ మ్యూజిక్ సెషన్స్ లో ఐకాన్ స్టార్ తో సుకుమార్,DSP ✨

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 (ది రూల్) మూవీలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుండి ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.కాగా మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ సెషన్స్ లో భాగంగా సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ని డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ కలిసిన సందర్భంగా దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ టీజర్ కి దేవిశ్రీ అదిరిపోయే రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినట్లు చెప్తున్నారు మేకర్స్. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి పుష్ప 2 మూవీని గ్రాండ్ గా ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.✨

bottom of page