పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై ఎప్పుడు నుంచో అనేక అంచనాలు నెలకొనగా ఇప్పుడు అవైటెడ్ టీజర్ (Pushpa 2 Teaser) కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ టీజర్ రాకముందు మాత్రం టీజర్ సహా సినిమాపై హైప్ ని మేకర్స్ మరో స్తాయిలోకి తీసుకెళ్తున్నారని చెప్పాలి.కేవలం అల్లు అర్జున్ పై ప్రీ లుక్ పోస్టర్స్ తోనే హైప్ ని అమాంతం పైకి తీసుకెళ్తున్నారు.ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పుష్పరాజ్ అమ్మవారి గెటప్‌లో కనిపిస్తుండగా.. ఒక చేత్తో త్రిశూలం పట్టుకుని.. మరో చేతిలో శంఖం ఊదుతున్నట్లు కనిపించాడు. ఇక బన్నీ ముఖం కనిపించకుండా పూర్తిగా కుంకుమతో నింపేశారు. ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు వరుస పోస్టర్లతో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయిన పుష్పరాజ్ ఉగ్రరూపంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో బన్నీ అభిమానులు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉవ్విళ్లూరుతున్నారు. మరి చూడాలి ఈ టీజర్ కట్ వచ్చాక పాన్ ఇండియా లెవెల్ హైప్ ఎలా ఉంటుందో అనేది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం అందిస్తుండగా ఈ రానున్న ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.🎥✨