ఏ బిడ్డా.. ఇది నా అడ్డా అంటూ టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనే జెండాపాతేశాడు ‘పుష్ప’రాజ్. ‘పుష్ప’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని మాస్ జాతర చూపించిన అల్లు అర్జున్..
ఇప్పుడు రెట్టించిన వేగంతో ‘పుష్ప’ చిత్రంలో రెడీ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.అయితే పుష్ప పార్ట్ 01 క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌తో పార్ట్ 2పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘పుష్పరాజ్’ పార్ట్2 రెడీ అయ్యారు. ఇక పుష్ప ది రూల్‌కి సంబంధించిన టీజర్ అప్డేట్ కోసం ఎప్పుడెప్పుడా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. టీజర్ అప్డేట్ ఇచ్చేశారు మూవీ మేకర్స్. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 08న పుష్ప 2 టీజర్ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. అయితే అల్లు అర్జున్ లుక్ ఏమీ రివీల్ చేయలేదు కానీ.. అమ్మ వారి రూపంలో ఉన్న పుష్పరాజ్ కాలి గజ్జెల్ని చూపిస్తూ.. ఎర్రటి కుంకుమ.. వెనుక దీపాలతో పుష్పరాజ్ అయితే ఏదో విధ్వంసం సృష్టించేట్టుగానే కనిపిస్తున్నాడు.🎥✨