top of page
Suresh D

అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం..

వరల్డ్ వైడ్ క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించగా.. ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరకి వచ్చి కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ విగ్రహాం పూర్తి కాగా.. నిన్న రాత్రి మార్చి 28న అల్లు అర్జున్ స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేశారు. ఈ విగ్రహం అల వైకుంఠపురంలో సినిమాలోని రెడ్ జాకెట్ కాస్ట్యూమ్ తో పుష్ప మేనరిజం చూపిస్తూ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఓపెనింగ్ తర్వాత తన మైనపు విగ్రహంతో సెల్ఫీ తీసుకుని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ప్రస్తుతం అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫోటోస్ వైరలవుతుండగా.. బన్నీకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు సినీ సెలబ్రెటీస్, అభిమానులు.

ఇప్పటికే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ ది మాత్రం దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అలాగే మార్చి 28న బన్నీ హీరోగా పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి విడుదలైన రోజు. అదే రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు బన్నీ. తన జీవితంలో ఇది మరుపురాని ప్రయాణమని.. ఈరోజు ఎప్పటికీ ప్రత్యేకమంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన వెన్నంటే ఉన్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు.


bottom of page