గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. అలాగే కస్టమర్లకు 5 రోజుల షాపింగ్ అవకాశాలను అందిస్తుంది. ప్రమోషనల్ కార్యకలాపాల్లో భాగంగా అమెజాన్ ఇండియా ఉత్తేజకరమైన డీల్స్, కొత్త ప్రోడక్ట్ లాంచ్‌లను చేయడానికి పోకోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లు సేల్ సమయంలో అనేక ఆఫర్లను పొందవచ్చని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. అధికారిక నాన్-మెంబర్ విక్రయాలు ప్రారంభమయ్యే 12 గంటల ముందు ఉత్పత్తులు, డీల్‌లపై తగ్గింపు ఆఫర్లను ప్రైమ్ మెంబర్లు పొందవచ్చు. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చేసే కొనుగోళ్లకు అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తున్నారు. అలాగే ప్రైమ్ సభ్యులు వారి మొదటి ఆర్డర్‌పై ఉచిత డెలివరీని అందించడంతో పాటు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి పే-ఆన్-డెలివరీ వంటి సేవలను అమెజాన్ అందిస్తుంది.
రాబోయే గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో లాజిటెక్, బోఆట్, సోనీ, ఎల్‌జీ, నాయిస్ వంటి ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్‌ల నుంచి గణనీయమైన తగ్గింపులు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సామ్‌సంగ్, ఎల్‌జీ, ఎంఐ, సోనీ వంటి బ్రాండ్‌ల టీవీలు కేవలం రూ.6,999 నుంచి కొనుగోలు చేయవచ్చు. అలాగే హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు కేవలం రూ.99 నుంచి అందుబాటులో ఉంటాయి. అలెక్సా, ఫైర్ టీవీ పరికరాలు రూ. 2,599 నుంచే అందుబాటులో ఉంటాయి. గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వివిధ వర్గాల ప్రజలతో పాటు టెక్ ఔత్సాహికులు తగ్గింపులు ధరల్లోనే ఉత్పత్తులను పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.