top of page
MediaFx

అమెజాన్‌ సేల్‌లో రూ.10 వేలలోనే సూపర్ ఫోన్స్‌..


* రూ. 10 వేల లోపు లభిస్తోన్న బెస్ట్ ఫోన్స్‌లో రెడ్‌మీ 13సీ ఒకటి. ఈ ఫోన్‌ను రూ. 9,499కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్షన్ 6100+ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, 5 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

* పోకో ఎమ్‌6 ప్రో 5జీ ఫోన్‌ను ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా రూ. 9,998కి సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, సెల్ఫీలు.. వీడియో కాల్స్‌ కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. * తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ ఫోన్స్‌లో iQOO Z9 Lite ఒకటి. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ తొలిసేల్‌ను ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్ ధర రూ. 9,999గా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

* అమెజాన్‌ సేల్‌లో రూ. 10 వేలలో లభిస్తోన్న మరో బెస్ట్‌ ఫోన్స్‌లో నోకియా జీ42 5జీ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 9,499కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రాసెసర్‌ను అందించారు. అలాగే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఈ ఫోన్‌లో అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

bottom of page