రూ. 43 వేల స్మార్ట్‌టీవీ రూ. రూ. 25 వేలకే..
- Suresh D
- Mar 29, 2024
- 1 min read
ప్రస్తుతం భారీ స్క్రీన్ టీవీలకు ఆదరణ పెరుగుతోంది. ఓటీటీల ద్వారా కొత్త సినిమాలు విడుదలైన కొన్ని రోజులకు అందుబాటులోకి రావడంతో పెద్ద సైజ్ స్క్రీన్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే ఒకప్పుడు స్మార్ట్ టీవీలు అంటే లక్షల్లో పలికేవి కానీ ప్రస్తుతం కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో ధరలు అమాంతం తగ్గుముఖం పడుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం రెడ్‌మీ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రెడ్‌మీ 43 ఇంచెస్ టీవీపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రెడ్‌మీ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 42,999కాగా ఏకంగా 42 శాతం డిస్కౌంట్‌తో రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ టీవీని రూ. 23,499కే సొంతం చేసుకోవచ్చు.