top of page
Suresh D

మండే ఎండల్లో కూల్‌ కూల్‌ ఆఫర్స్‌..

ఎండలు పెరుగుతున్న వేళ అమెజాన్ చల్లటి కబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో వివిధ కంపెనీ ఏసీలను అతి తక్కువ ధరకే అందజేస్తున్నట్టు ప్రకటించింది. ఇవి భారీ డిస్కౌంట్ లో అంటే దాదాపు 44 శాతం తగ్గింపు ధరలలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఒక చిన్న గదికి సరిపడే ఏసీ నుంచి విశాల ప్రాంతానికి అవసరమయ్యే భారీ ఏసీల వరకూ దొరుకుతాయి. ఎల్‌జీ, వోల్టాస్ వంటి ప్రముఖ బ్రాండ్లతో పాటు ప్రత్యేక ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక గృహాల అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు. కెపాసిటీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, కూలింగ్ పవర్ పరంగా మీకు సరిపోయే టాప్ 8 స్ప్లిట్ ఏసీల గురించి తెలుసుకుందాం.

వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ..

మీడియం సైజ్ గదులకు సరిగ్గా సరిపోతుంది. దీనిలోని ఇన్వర్టర్ కంప్రెసర్ హీట్ లోడ్ ఆధారంగా శక్తిని సర్దుబాటు చేస్తుంది, వేరియబుల్-స్పీడ్ ఆపరేషన్‌ ఉంది. రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. రాగి కండెన్సర్ కాయిల్ చక్కని చల్లదనాన్ని అందిస్తుంది. యాంటీ-డస్ట్ ఫిల్టర్, యాంటీ-కారోసివ్ కోటింగ్ వంటి ఫీచర్లు బాగున్నాయి. ఈ మోడల్ పై ఏడాది, కంప్రెసర్‌పై పదేళ్ల గ్యారంటీ ఉంది. దీని కూలింగ్ సామర్థ్యం 1.5 కిలోవాట్లు. దీని ధర అమెజాన్‌లో రూ. 30,990గా ఉంది.

లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ..

వేరియబుల్-స్పీడ్ కంప్రెసర్‌ కారణంగా మంచి చల్లదనాన్ని అందిస్తుంది. గదిలోని ఉష్ణోగ్రత ఆధారంగా సర్దుబాటు చేసుకుంటుంది. దీనిలోని 5-ఇన్-1 కన్వర్టిబుల్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణ. 160 చదరపు అడుగుల పరిమాణంలోని మధ్యస్థ గదులకు సరిపోతుంది. గోల్డెన్ ఫిన్ ఆవిరిపోరేటర్ కాయిల్స్‌ తుప్పు పట్టకుండా చూస్తాయి. అలాగే మన్నిక బాగుంటుంది. ఎల్ ఈడీ డిస్‌ప్లే ఉంది. దీని ధర అమెజానలో రూ. 32,990గా ఉంది.

డైకిన్ 0.8 టన్ 3 స్టార్, ఫిక్స్‌డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ..

కేవలం చిన్న గదులకు సరిపడే ఏసీ ఇది. నాన్-ఇన్వర్టర్ కంప్రెసర్, పవర్ చిల్ ఆపరేషన్‌తో చల్లదనాన్ని అందిస్తుంది. పీఎం 2.5 ఫిల్టర్‌, ఇన్వర్టర్ కంప్రెసర్, డ్రై మోడ్, స్వీయ-నిర్ధారణ, ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్ దీనికి ప్రత్యేకతలు. దీని ధర అమెజాన్లో రూ.27,990గా ఉంది.

పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ..

వైఫై తదితర స్మార్ట్ ఫీచర్లు, అధునాతన టెక్నాలజీలో మంచి కూలింగ్ ను అందజేస్తుంది. గది ఉష్ణోగ్రత, సూచనల ఆధారంగా సర్దుబాటు చేసుకుంటుంది. మధ్యస్థ పరిమాణ గదులకు చక్కగా సరిపోతుంది. పీఎం 0.1 ఫిల్టర్, ఏఐ మోడ్‌తో 7-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్‌లు, అలెక్సా, గూగుల్‌తో వాయిస్ నియంత్రణ దీని ప్రత్యేకతలు. అమెజాన్‌ ప్లాట్‌ఫారంలో దీని ధర రూ. 44,990గా ఉంది.

ఎల్ జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ..

అధునాతన ఫీచర్లతో మెరుగైన సౌకర్యాన్ని ఇచ్చే ఏసీ ఇది. వేరియబుల్-స్పీడ్ కంప్రెసర్ హీట్ లోడ్ ఆధారంగా శక్తిని సర్దుబాటు చేస్తుంది. ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్‌తో కూడిన కాపర్ కండెన్సర్ కాయిల్ మన్నిక బాగుంటుంది. యాంటీ వైరస్ తో కూడిన హెచ్ డీ ఫిల్టర్, గోల్డ్ ఫిన్+ పూత వంటి ప్రత్యేక ఫీచర్ల కారణంగా గాలి నాణ్యత బాగుంటుంది. ఈ ఏసీ అమెజాన్లో రూ.54,999 ధరకు అందుబాటులో ఉంది.

డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ..

దీనిలోని ఇన్వర్టర్ స్వింగ్ కంప్రెసర్ అధిక శక్తిని విడుదల చేస్తుంది. డ్యూ క్లీన్ టెక్నాలజీ కారణంగా ఆరోగ్యకరమైన గాలి వస్తుంది. చిన్న గదులకు బాగా సరిపోతుంది. పీఎం 2.5 ఫిల్టర్ గాలి నాణ్యతను పెంచుతుంది. దీని ధర అమెజాన్‌లో రూ.39490గా ఉంది.

bottom of page