అమెజాన్ సబ్‌స్క్రైబర్లకు ఇకనుంచి యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ లభించదు. ఎందుకంటే ఈ కంపెనీ 2024, జనవరి 29 నుంచి కొన్ని సినిమాలు, టీవీ షోలలో యాడ్స్ (Ads) చూపడం స్టార్ట్ చేయనుంది.
సాధారణంగా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌లలో యాడ్స్ వస్తూ ఉంటే చాలా విసుగు కలుగుతుంది. వీటి వల్ల సినిమా లేదా టీవీ షో వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతింటుంది. అందుకే స్ట్రీమింగ్ సర్వీస్‌లు సబ్‌స్క్రైబర్లకు యాడ్-ఫ్రీ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంటాయి. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) కూడా యాడ్-ఫ్రీ కంటెంట్ అందిస్తుంది. అయితే 2024, జనవరి 29 నుంచి అమెజాన్ సబ్‌స్క్రైబర్లకు యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ లభించదు.
ఎందుకంటే ఈ కంపెనీ 2024, జనవరి 29 నుంచి కొన్ని సినిమాలు, టీవీ షోలలో యాడ్స్ (Ads) చూపడం స్టార్ట్ చేయనుంది. 2006లో లాంచ్ చేసిన సమయం నుంచి అమెజాన్ ఇప్పటిదాకా సబ్‌స్క్రైబర్స్‌కు ఒక్క ప్రకటన కూడా చూపించలేదు. కానీ వచ్చే నెల నుంచి అది మారనుంది. వచ్చే నెల నుంచి అమెజాన్ కంటెంట్‌లో యాడ్స్ ప్రవేశపెట్టనుందని అమెరికన్ టెక్నాలజీ న్యూస్ వెబ్‌సైట్ ది వెర్జ్ (The Verge) లేటెస్ట్ రిపోర్టు వెల్లడించింది. కొన్ని కంటెంట్లలో ప్రకటనలను పరిచయం చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తోందని నివేదిక పేర్కొంది.
అమెజాన్ సెప్టెంబర్ నెలలోనే యాడ్స్ తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా వాటిని ఎప్పటినుంచి ప్రవేశం పెట్టనున్నారనే డేట్ తెలిసింది. కంపెనీ ప్రకారం, టీవీ ఛానల్స్‌లో లాగా కాకుండా ఈ యాడ్స్ చాలా లిమిటెడ్‌గా కనిపిస్తాయి, వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు పెద్దగా అంతరాయం కలిగించవు. ఈ ప్రకటనల రెవెన్యూ ద్వారా సబ్‌స్క్రైబర్లకు మరింత క్వాలిటీ కంటెంట్‌ను అందిస్తామని అమెజాన్ కంపెనీ పేర్కొంది.🌍📈