నెట్‌ఫ్లిక్స్‌కు అమెజాన్ సవాల్.. ఒక్కసారే 50కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు🎥✨
- Suresh D
- Mar 21, 2024
- 1 min read
Updated: Mar 22, 2024
ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒక్కసారి పంపై .. చూసుకుందాం నీ పతాపమో నా పతాపమో అన్న రేంజ్‌లో ప్రైమ్ వీడియో (Prime Video) సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ను తలదన్నేలా నెటిజన్లు, అభిమానులు తమ కనురెప్పలు కొట్టేంత సమయం కూడా ఇవ్వకుండా తమ అప్‌కమింగ్ సినిమాలు, వెబ్ సిరిస్‌లను ప్రకటిస్తూ అప్‌డేట్లతో ముంచెత్తింది.
గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించిన ఈ తరహా సాంప్రదాయాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో అందిపుచ్చుకుని నెట్‌ఫ్లిక్స్‌ను మించి మా స్టామినా ఇది అనే రేంజ్‌లో భారీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు వెళ్లడించి అవతలి సంస్థలు కంగుతినేలా చేసింది.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లలో మాదే రాజ్యం అని ఇక చూసుకుదాం.. ఆట ఇప్పుడే మొదలైంది.. అన్నట్లుగా తమ కంటెంట్‌ను, వారితో పరిచయాలను సోషల్ మీడియాలో ప్రతి నిమిషం ప్రకటిస్తూ వచ్చింది.
ముఖ్యంగా ప్రైమ్ వీడియో (Prime Video) తాజాగా ప్రకటించిన వాటిల్లో పవన్‌కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagath Singh), రామ్ చరణ్ గేమ్ చేంజర్ (Game Changer), నితిన్ తమ్ముడు (Thammudu), సూర్య కంగువ (Kanguva), విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ (FamilyStar), కాంతారా (Kantara Chapter1), అనుష్క శెట్టి (Anushka Shetty) గాటి (Ghaati), శ్రీవిష్ణు ఓమ్ భీం భుష్ (Om Bheem Bush),సుహాస్, కీర్తి సురేష్ ఉప్పుకప్పురంబు (Uppu Kappu Rambu) వంటి సినిమాలతో పాటు
మిర్జాపూర్ 3 (Mirzapur) , వరుణ్ దావణ్, సమంతల సిటాడెల్, ఫ్యామిలీమెన్ 3, నాగ చైతన్య ధూత, ఐశ్వర్య రాజేశ్ సుజల్ (Suzhal The Vortex), పాతాల్ లోక్ (Paatal Lok) సీజన్ 2,సంచాయత్ (Panchayat) సీజన్ 3, బందీస్ బండిట్స్ (Bandish Bandits) , సివరాపల్లి (Sivarapalli) వంటి అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌లను కొన్ని బాలీవుడ్ సినిమాలను త్వరలో స్ట్రీమిగ్‌కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అయితే.. ఇప్పుడు ప్రైమ్ వీడియో (Prime Video) తమ కంటెంట్‌ను ప్రకటించి ఇండైరెక్ట్‌గా ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి మేము సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ అవతలి ఫ్లాట్ ఫాంలకు సవాల్ విసరడంతో నెట్‌ఫ్లిక్స్ కూడా త్వరలో తమ కంటెంట్‌ను ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఒకరితో ఒకరు పోటీ పడి మరి భారీగా తమ అప్ కమింగ్ కంటెంట్‌ను ప్రకటించిన నేపథ్యంలో సబ్‌స్క్రిప్షన్ రేట్లను ఏమూనా పెంచుతారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. మరికొన్ని రోజులు ఆగుతేనే గానీ అసలు విషయం బయట పడదు. అప్పటివరకు వెయిట్ అండ్ సీనే.🎥✨